Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - గుంటూరు
చనిపోయిన మాస్టారుకు పదో తరగతి మూల్యాంకన విధులు కేటాయించడం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. గుంటూరు జిల్లా తెనాలి ఐతానగర్‌లోని ఎన్ఎస్ఎస్ఎం హైస్కూల్లో గణిత ఉపాధ్యాయుడు జి.నాగయ్య కొద్దికాలం కిందట మృతి చెందారు.
ఈ తరుణంలో రేపటి నుంచి నిర్వహించనున్న పదో తరగతి మూల్యాంకన విధులు ఆయనకూ కేటాయిస్తూ జిల్లా విద్యాశాఖాధికారి ఉత్తర్వులిచ్చారు. దీనిపై ఆ పాఠశాల తల్లిదండ్రుల కమిటీ ఛైర్మన్ ఎం.రాజు సోమవారం స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. దీనిపై తెనాలి డివిజన్ ఉప విద్యాశాఖాధికారిణి నిర్మలను వివరణ కోరగా పాఠశాల నుంచి వచ్చిన జాబితాను పంపామని, రికార్డుల పరంగా ఆయన చనిపోయినట్లు ఎటువంటి ధ్రువపత్రం సమర్పించలేదన్నారు.