Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో 100 పడకల ఆస్పత్రికి మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా మంజూరు చేసిన ఈ ఆస్పత్రిని రూ.36కోట్ల నిధులతో నిర్మించనున్నారు. ఈ తరుణంలో మీడియా సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడుతూ ఉమ్మడి నల్గొండ జిల్లాలో వైద్యఆరోగ్యశాఖ పరిధిలో రూ.1300కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఉప ఎన్నిక సందర్భంగా ఇచ్చిన హామీ ప్రకారం సీఎం కేసీఆర్ సూచనలతో 100 పడకల ఆస్పత్రికి శంకుస్థాపన చేశామన్నారు. మర్రిగూడలో 30 పడకల ఆస్పత్రి మంజూరు చేశామని తంగేడిపల్లి పీహెచ్‌సీకి రూ.90లక్షలు కేటాయించామని తెలిపారు.