Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢిల్లీ
మార్గదర్శి కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. డిపాజిట్ల వివరాలు బయటపెట్టాలని సుప్రీం ఆదేశించింది. మార్గదర్శిలో ఇన్వెస్ట్మెంట్ ఎంత? చెల్లింపులు ఎంత? వివరాలు బయట పెట్టడంలో రహస్యం ఎందుకని ప్రశ్నించింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసుపై జస్టిస్ సూర్య కుమార్, జస్టిస్ జె.బి.పర్డీవాలా ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. ఒక వైపు హెచ్యుఎఫ్, మరో వైపు ప్రొప్రైటరీ కన్సర్న్ అంటున్నారు. దీంతో డిపాజిటర్లందరికీ చెల్లింపులు చేశామని మార్గదర్శి లాయర్ తెలపగా, చెల్లింపులు చేశాక వివరాలు బయటపెట్టడంలో అభ్యంతరం ఏంటని మాజీ ఎంపీ ఉండవల్లి వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించింది.