Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - వాషింగ్టన్
తన ఇంటి డోర్‌ను రెండు సార్లు కొట్టాడని కోపోద్రికుడైన ఓ వృద్ధుడు యువకుడిపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటన ఆమెరికాలోని కాన్సాస్ నగరంలో ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ ఉదంతంలో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.
అమెరికాలోని కాన్సాస్ నగరానికి చెందిన యువకుడు రాల్ఫ్ యార్ల్ (16) ఒక నల్లజాతీయుడు. తన కవల సోదరులను తీసుకువెళ్లడానికి పొరపాటున వేరే ఇంటికి వెళ్లాడు. ఇంటి డోర్ బెల్‌ను రెండు సార్లు మోగించాడు. దీంతో శ్వేతజాతీయుడైన ఇంటి యజమాని ఆగ్రహానికి గురై యువకుడిపై విచక్షణా రహితంగా రెండు సార్లు కాల్పులు జరిపాడు. దీంతో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. నిందితుడిని ఆండ్రూ లెస్టర్ (85)గా పోలీసులు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని 24 గంటల కస్టడీ తర్వాత విడుదల చేశారు.