Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్: గచ్చిబౌలిలో ఇన్సోఫి అనే సాఫ్ట్వేర్ సంస్థ బోర్డు తిప్పేసింది. కంపెనీ నుంచి తొలగిస్తున్నట్లు ఉద్యోగులకు సమాచారం అందించింది. ఆ సంస్థలో మొత్తం 700 మంది ఉద్యోగులు ఉండగా.. వారిలో 650 మంది పేరుతో రూ.4 లక్షలు, మరో 50 మంది పేరుతో రూ.10 లక్షలు చొప్పున రుణాలు తీసుకుంది. ట్రైనింగ్ పేరుతో గత ఏడాదిన్నరగా జీతాలు చెల్లించలేదని ఉద్యోగులు వాపోతున్నారు. గచ్చిబౌలిలోని కంపెనీ ఎదుట వారంతా ఆందోళనకు దిగడంతో విషయం వెలుగులోకి వచ్చింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఆరా తీస్తున్నారు.