Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - తిరుపతి
తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం, ఇతర సేవల టికెట్లను టీటీడీ నెలకోసారి ఆన్ లైన్ లో విడుదల చేస్తుండడం తెలిసిందే. టీటీడీ ఆ టికెట్లను విడుదల చేసే కొన్నిరోజుల ముందు తేదీలు ప్రకటించేది. ఇప్పుడు, ఒక నెలలో విడుదల చేసే అన్ని రకాల టికెట్లకు సంబంధించిన తేదీలతో క్యాలెండర్ విడుదల చేసింది. తిరుమల భక్తులకు ఈ క్యాలెండర్ ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది. ఈ నెలలో ఏ తేదీన ఏ టికెట్లు విడుదల చేస్తారో భక్తులకు క్యాలెండర్ రూపంలో అందుబాటులోకి వచ్చినట్టయింది.