Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కడప ఎంపీ అవినాష్‌రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్‌రెడ్డిని ఇటీవల సీబీఐ అరెస్టు చేసింది. కేసుకు సంబంధించి కీలక సమాచారం సేకరించాల్సి ఉన్నందున ఉదయ కుమార్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డిని కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది.
ఈ తరుణంలో విచారణ చేపట్టిన సీబీఐ కోర్టు భాస్కర్‌రెడ్డి, ఉదయ కుమార్‌రెడ్డిని ఆరు రోజుల పాటు సీబీఐ కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. చంచల్‌గూడ జైల్లో ఉన్న ఇద్దరు నిందితులను రేపటి నుంచి ఆరు రోజుల పాటు సీబీఐ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు.