Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మాటలు వింటే నవ్వాలో, ఏడవాలో అర్థం కావడం లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విమర్శించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ఒకే రోజులో 2 లక్షల ఉద్యోగాలను ఇస్తామంటున్నారని అన్నారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలంటూ మోడీ మోసం చేశారని మండిపడ్డారు. 22.06 కోట్ల దరఖాస్తులు వస్తే 7,22,311 ఉద్యోగాలు ఇచ్చామని, పార్లమెంట్లో ప్రధాని సమాధానం ఇచ్చారని గుర్తుచేశారు. పార్లమెంట్ సాక్షిగా నిరుద్యోగులను మోసం చేసినట్లు అంగీకరించారని తెలిపారు.