Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : వరల్డ్ హెరిటేజ్ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. హైదరాబాద్ నగరాన్ని వరల్డ్ హెరిటేజ్ సిటీగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని పురస్కరించుకొని.. గత కొన్నేండ్ల నుంచి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో అభివృద్ధి పరిచిన కొన్ని వారసత్వ కట్టడాలను మీ ముందు ఉంచుతున్నానని కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు. బన్సీలాల్పేట మెట్ల బావి, కుతుబ్షాహీ టూంబ్స్, మొజాం జాహీ మార్కెట్, సికింద్రాబాద్ క్లాక్ టవర్ లాంటి వారసత్వ కట్టడాలను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో అభివృద్ధి పరిచిన సంగతి తెలిసింది. చెత్తచెదారంతో నిండిపోయిన బన్సీలాల్పేట మెట్లబావిని పునరుద్ధరించి, సందర్శకులకు అందుబాటులోకి తీసుకొచ్చారు.