Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ముంబై ఇండియన్ గెలుపొందింది. ముంబై నిర్దేశించిన 193 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్ ఛేధించలేకపోయింది. 178 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో.. ముంబై జట్టు 14 పరుగుల తేడాతో విజయం సాధించింది. మయాంక్ అగర్వాల్ పోరాటం, క్లాసెన్ మెరుపు ఇన్నింగ్స్ పుణ్యమా అని ఈ మ్యాచ్ చివర్లో ఉత్కంఠభరితంగా మారింది కానీ.. చివర్లో భారీ షాట్లు బాదే ఆటగాడు లేకపోవడంతో ముంబైకి అనుకూలంగా మారింది. అర్జున్ టెండూల్కర్ వేసిన చివరి ఓవర్లో రెండు వికెట్లు (ఒకటి రనౌట్, మరొకటి క్యాచ్ ఔట్) పడటంతో.. హైదరాబాద్‌పై ముంబై విజయఢంకా మోగించింది. ఈ మ్యాచ్‌తో ముంబై హ్యాట్రిక్ నమోదు చేసింది.