Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్: రాష్ట్రంలో బుధవారం నుంచి కొవిడ్ బూస్టర్ డోస్ పంపిణీ చేయనున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కొవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో వ్యాక్సినేషన్‌ను ప్రారంభిస్తున్నట్లు వైద్యఆరోగ్యశాఖ డైరెక్టర్ జి.శ్రీనివాసరావు మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్రంలో మొదటి రెండు డోసులు కొవాగ్జిన్ లేదా కొవిషీల్డ్ టీకాలు వేయించుకున్నవారు బూస్టర్ డోస్‌గా కార్బేవ్యాక్స్ను తీసుకోవచ్చని తెలిపారు. బుధవారం నుంచి అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని వివరించారు. బహిరంగ మార్కెట్ నుంచి సమకూర్చుకోవాలని కేంద్ర ఆరోగ్యశాఖ ఇటీవల స్పష్టం చేయడంతో.. రాష్ట్ర ప్రభుత్వం మొదటి విడతగా 5 లక్షల టీకాలను అందుబాటులోకి తెచ్చింది.