Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకూ క్రమంగా పెరుగుతున్న వేడిగాలుల తీవ్రత, అధిక ఉష్ణోగ్రతలు ప్రజలపై ప్రభావం చూపుతున్నాయి. పనివేళలపైనా ప్రభావం పడుతోంది. ఇక వడదెబ్బ బారినపడుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగం సూచిస్తోంది. ఈ సీజన్లోనే అత్యధిక ఉష్ణోగ్రతలు శుక్రవారం ఆదిలాబాద్ జిల్లాలో నమోదయ్యాయి. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో వడదెబ్బతో ఇద్దరు మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో ఉట్నూర్ మండలం పులిమడుగులో ఒక్కరు, కొమరంభీం జిల్లా కాగజ్నగర్ లో ఇబ్రాహీం అనే పండ్ల వ్యాపారి వడదెబ్బతో మృతి చెందడం కలకలం రేపింది. ఈ సీజన్ లో ఇప్పటి వరకు మొత్తం 5 వడదెబ్బ మరణాలు చోటుచేసుకోవడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.