Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : కడపలో విషాదం చోటు చేసుకుంది. వివాహం జరిగిన ఏడాదికే దంపతులు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. కడపలోని విజయదుర్గా కాలనీకి చెందిన సాయికుమార్ రెడ్డి, హేమమాలినీలకు ఏడాది క్రితం వివాహమైంది. సాయికుమార్ రెడ్డి వ్యాపారాలు చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఈ నేపథ్యంలో గత కొద్ది రోజుల నుంచి భార్యాభర్తలిద్దరూ ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. హేమమాలిని 8 నెలల గర్భవతి. ఆర్థిక సమస్యలు ఎక్కువ కావడంతో జీవితంపై విరక్తి చెంది భార్యాభర్తలిద్దరూ మంగళవారం రాత్రి కడప శివారులోని కనుమలోపల్లి సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలుసుకున్న కడప రైల్వే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. దంపతుల మృతికి ఆర్థికపరమైన సమస్యలా? ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.