Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : మెటా సంస్థ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ నుంచి ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. మెటా వ్యవస్థాపకుడు మార్క్ జుకర్బర్గ్ తన సంస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దడంలో భాగంగా.. సరికొత్త టీమ్లను పునర్నర్మిస్తున్నారు. బుధవారం ఉద్యోగాల కోతలను ప్రకటించడానికి సిద్ధం కావాలని ఈ ఫేస్బుక్ మాతృ సంస్థ మేనేజర్లకు తెలియజేసింది. మార్చిలో మార్క్ జూకర్బర్గ్ ప్రకటించినట్టు.. ఖర్చును తగ్గించుకోవడంలో భాగంగానే మెటా సంస్థ కోతలకు సిద్ధమైంది. మొత్తం 10 వేల మంది తొలగించేందుకు రెడీ అయ్యారు. ఇప్పుడు కొందరిని తొలగించి, రెండో రౌండ్లో భాగంగా మే నెలలో మరికొందరిని తొలగించాలని నిర్ణయించినట్టు తెలిసింది.