Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - శ్రీకాకుళం
శ్రీకాకుళం పర్యటనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక ప్రకటన చేశారు. పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా సెప్టెంబర్ నుంచి విశాఖ నుంచే పాలన సాగిస్తామని స్పష్టం చేశారు. ఈ సెప్టెంబర్ నుంచి విశాఖలోనే ఉంటానని, రాష్ట్రంలో అందరికీ ఆమోదయోగ్య నగరం విశాఖ అని సీఎం అన్నారు. మీ బిడ్డ ఒక్కడే ఒకవైపు ఉన్నాడు. అంతా ఏకమై నాతో చీకటి యుద్దం చేస్తున్నారు. రాష్ట్రంలో పెత్తందార్లు, పేదల పక్షాన నిలబడిన నాకు మధ్య యుద్ధం జరుగుతోంది. ఒకే అబద్ధాన్ని పదేపదే చెబుతున్నారు. వాళ్లలా అబద్ధాలు చెప్పే అలవాటు నాకు లేదు. ఈ యుద్ధంలో నా ధైర్యం, నమ్మకం, ఆత్మ విశ్వాసం మీరే. దేవుని దయ మీ చల్లని ఆశీస్సులే కోరుకున్నా. తోడేళ్లనీ ఏకమైనా నాకేమీ భయం లేదు అని సీఎం తెలిపారు. ప్రాంతాల మధ్య వైషమ్యాలు పోవాలనే అని జిల్లాల అభివృద్ధి. ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నదే తపన అంటూ సీఎం పిలుపునిచ్చారు. మూలపేట గ్రీన్ఫీల్డ్ పోర్ట్ నిర్మాణం, నౌపడ వద్ద పోర్టు నిర్వాసిత కాలనీకి సీఎం జగన్ బుధవారం శంకుస్థాపన చేశారు. ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం ఫిషింగ్ హార్బర్ సహా హిర మండలం వంశధార లిప్ట్ లిరిగేషన్ ప్రాజెక్టులకు సీఎం శంకుస్థాపన చేశారు. ఈ తరుణంలో బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. పోర్టు సామర్ధ్యం 100 మిలియన్ టన్నులకు పెరగనుంది. గంగపుత్రుల కళ్లలో కాంతులు నింపడానికే ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం. గంగపుత్రుల వేరే ప్రాంతాలకు వలసలు పోకుండా ఉండేందుకు కృషి. పోర్టుతోపాటు మరో రెండు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం. బుడగట్లపాలెం తీరంలో రూ.365 కోట్లతో ఫిషింగ్ హార్బర్. మన అధికారంలోకి వచ్చిన తర్వాత మరో 4 పోర్టులకు శ్రీకారం చుట్టాం. బుడగట్లపాలెం తీరంలో రూ.365 కోట్లతో ఫిషింగ్ హార్బర్. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మరో 4 పోర్టులకు శ్రీకారం చుట్టాం అని సీఎం జగన్ తెలియజేశారు.