Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - వాషింగ్టన్
మెనే రాష్ట్రంలో మంగళవారం దారుణం చోటు చేసుకొంది. బౌడోయిన్ ప్రాంతంలోని ఓ ఇంటిలో జరిగిన కాల్పుల్లో నలుగురు మృతి చెందారు. అనంతరం 295వ నంబర్ హైవేపై కూడా పలు వాహనాలపై కాల్పులు చోటు చేసున్నాయి. పోర్ట్‌ల్యాండ్ - బౌడోయిన్ మధ్య ఈ ఘటన జరిగింది. ఈ దాడిలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడినట్టు పోలీసులు తెలిపారు.
రెండు చోట్ల జరిగిన కాల్పులకు సంబంధం ఉందని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు లోనయ్యారు. దీంతో హైవేలో కొంత భాగాన్ని గంటన్నర పాటు పోలీసులు మూసివేశారు. ప్రజలు ఎవరూ బయటికి రావొద్దని నిషేధాజ్ఞలు జారీ చేశారు. బౌడోయిన్లోని ఓ ఇంటిలో నలుగురి మృతికి కారణమైనట్లు అనుమానిస్తున్న జోసెఫ్ ఈటన్(34) అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని ఈ వారం కోర్టులో హాజరుపరుస్తామని పోలీసులు వెల్లడించారు.