Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అమరావతి
జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం షెడ్యూల్ ఈనెల 29 వరకు పెంచుతూ వైసీపీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలకు సమాచారం పంపింది. వైసీపీ కేంద్ర కార్యాలయం రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న అపూర్వ స్పందన, ప్రజలు భాగస్వామ్యం అవుతున్న తీరుతో షెడ్యూల్ ని పెంచింది. ఈ నెల 20 వరకే పూర్తి కావల్సిన ఈ కార్యక్రమం ప్రజల స్పందనతో మరో 9 రోజులు కొనసాగించాలని పార్టీ నిర్ణయించింది.
జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం చేపట్టి మా నమ్మకం నువ్వే జగనన్న అంటూ ప్రతి ఇంటికి తిరుగుతూ జగనన్న పాలనలో జరుగుతున్న మంచిని మంత్రి అడిగి తెలుసుకుంటున్నారు. గత ప్రభుత్వానికి ప్రస్తుత మన జగనన్న సంక్షేమ పాలనపై వ్యత్యాసంను వివరిస్తూ జగనన్న పాలనపై ప్రజా అభిప్రాయాన్ని సేకరించారు. ఈ తరుణంలో ప్రతి ఇంటికీ స్టిక్కర్ అతికించి, వైయస్ జగన్‌కు మద్దతుగా 82960 82960 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇచ్చి ముఖ్యమంత్రి సందేశాన్ని వినిపించి, వారితో సెల్ఫీలు దిగుతున్నారు. ఈ కార్యక్రమం మరిన్ని రోజులు పెంచడంతో వైసీపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.