Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కడప
బద్వేల్ లో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. చంద్రబాబు పర్యటనను అడ్డుకునేందుకు అనుచరులతో సహా వైసీపీ ఎమ్మెల్యే సుధా రోడ్డుపైకి వచ్చారు. ఆయన దళితులను అవమానించారంటూ ఎమ్మెల్యే నిరసనకు దిగారు. దళితులను అవమానించిన చంద్రబాబు, నారా లోకేష్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అంతే కాకుండా నల్ల బ్యాడ్జీలు, నల్ల జెండాలతో కాన్వాయ్ వెళ్లే మార్గంలో నిరసన తెలిపారు. చంద్రబాబు గోబ్యాక్ అంటూ వైసీపీ శ్రేణులు ఆందోలనకు దిగాయి.