Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కర్ణాటక
మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి సొంతంగా కల్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఆయన పార్టీ పోటీ చేస్తోంది. మరోవైపు అక్రమ మైనింగ్ కేసులో నిందితుడిగా ఉన్న ఆయన బెయిల్ పై బయట ఉన్నారు. ఈ క్రమంలో బళ్లారికి వెళ్లకూడదనే బెయిల్ షరతు ఆయనకు ఉంది. దీంతో తన బెయిల్ షరతులను సడలించాలంటూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనను బళ్లారికి వెళ్లేందుకు అనుమతించాలని సుప్రీంను ఆయన కోరారు. ఈ పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు బెయిల్ నిబంధనలను సడలించడం కుదరదని స్పష్టం చేసింది.