Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిని మరింత విస్తరించి, స్వీయ ఆదాయ మార్గాలను పెంచుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులకు సూచించారు. బీఆర్కే భవన్లో వైటీడీఏ, శిల్పారామాల అభివృద్ధిపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం వైటీడీఏ పరిధిలో ఏడు గ్రామాలే ఉన్నాయని, ఈ పరిధిని మరింత విస్తరించాలని సూచించారు. ఇందుకు ప్రతిపాదనలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. దేవస్థాన పరిసర ప్రాంతాలను, గ్రామాలను అభివృద్ధి పరిచి స్వీయ ఆదాయ వనరులు పెంచుకోవాలన్నారు.
ఈ సమావేశంలో దేవస్థానం సంబంధించిన ఆడిట్ నివేదికలను, శిల్పారామాల పనితీరును సమీక్షించారు. సమావేశంలో ఆర్థిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, దేవాదాయశాఖ కమిషన్ అనిల్ కుమార్, వైటీడీఏ వీసీ కిషన్ రావు, యాదాద్రి దేవస్థానం ఈవో గీత, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.