Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢిల్లీ
దేశంలోని వివిధ సాయుధ బలగాల్లో 50,187 కానిస్టేబుల్ (జీడీ) రైఫిల్‌మ్యాన్/సిఫాయి పోస్టుల కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ) గతేడాది నవంబర్‌లో భారీ జాబ్ నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. పదో తరగతి విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగా జనవరి, ఫిబ్రవరి నెలల్లో జరిగిన ఎస్ఎస్సీ ఓపెన్ కాంపిటీటివ్ పరీక్ష ఫలితాలు ఇటీవలే విడుదలయ్యాయి. ఈ తరుణంలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) తాజాగా ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ పరీక్ష తేదీలను ఖరారు చేసింది. రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు పీఎస్టీ/ పీఈటీలను ఏప్రిల్ 24 నుంచి మే 8 వరకు నిర్వహించనున్నట్లు తెలిసింది.
బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బీ, ఎస్ఎస్ఎఫ్లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులు; అస్సాం రైఫిల్స్‌లో రైఫిల్‌మ్యాన్ (జనరల్ డ్యూటీ); ఎన్సీబీలో సిపాయి పోస్టులు భర్తీకి శారీరక సామర్థ్య/ ప్రమాణ పరీక్షలు దేశవ్యాప్తంగా సీఆర్పీఎఫ్ శిక్షణ కేంద్రాల్లో జరుగనున్నాయి. ఈ-అడ్మిట్ కార్డులను సైతం డౌన్లోడ్ చేసుకొనేందుకు అందుబాటులో ఉంచారు. అడ్మిట్ కార్డు లేకుండా శారీరక సామర్థ్య పరీక్షలకు అభ్యర్థులను అనుమతించబోమని అధికారులు స్పష్టంచేశారు.