Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియం వేదికగా రసవత్తరమైన మ్యాచ్ జరుగుతోంది. ఐపీఎల్ 2023 సీజన్లో 26వ మ్యాచ్ సంజూ శాంసన్ రాజస్థాన్ రాయల్స్, కేఎల్ రాహుల్ నేతృత్వంలోని లక్నో సూపర్ జెయింట్‌తో తలపడుతోంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్. దీంతో లక్నో బ్యాటింగ్‌కు దిగింది. లక్నో నుంచి ఓపెనింగ్‌కు దిగిన కైల్ మేయర్స్ , కేఎల్ రాహుల్ నెమ్మదిగా ఆట ప్రారంభించిన 39 పరుగులు చేసిన కేఎల్ రాహుల్ హోల్డర్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి తొలి వికెట్‌ను సమర్పించుకున్నాడు.
బౌల్ట్ బౌలింగ్‌లో ఆయుష్ బదోని(1) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 85 పరుగుల వద్ద లక్నో రెండో వికెట్‌ను కోల్పోయింది. అంతే కాకుండా కైల్ మేయర్స్ ను అశ్విన్ క్లీన్ బౌల్డ్ చేయడంతో ఒకే ఓవర్లో అశ్విన్ రెండు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. 18 ఓవర్లు ముగిసే సరికి లక్నో స్కోరు 4 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. మార్కస్ స్టోయినిస్(21), నికోలస్ పూరన్(25) క్రీజులో ఉన్నారు.