Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ అమెజాన్ప్రైమ్ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. డైలాగులు స్పష్టంగా వినిపించేలా డైలాగ్ బూస్ట్ సదుపాయాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ యూజర్ల కోసం తీసుకొచ్చింది. అమెజాన్ ప్రైమ్ ‘డైలాగ్ బూస్ట్’ పేరుతో తీసుకొస్తున్న కొత్త ఫీచర్ ద్వారా ఎటువంటి ఇబ్బంది లేకుండా సంభాషణలను మరింత స్పష్టంగా వినవచ్చు. ఈ ఫీచర్ కోసం వీడియో మెనూ బార్లో ఉన్న ఆడియో - సబ్మిషన్ పై క్లిక్ చేయాలి. అందులో మీడియం, హై అనే ఆప్షన్స్‌ను ఎంచుకోవచ్చు. మీ సౌకర్యాన్ని బట్టి ఏది కావాలంటే దాన్ని ఎంపిక చేసుకోవచ్చు.