Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలలంగాణ - ఢిల్లీ
జనవరిలో జరిగిన జేఈఈ మెయిన్ తొలి విడత పరీక్షలు జరగ్గా.. ఇటీవల రెండో విడత పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 6 నుంచి 15వరకు జరిగిన జేఈఈ మెయిన్ (సెషన్-2) పరీక్ష ప్రాథమిక కీను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బుధవారం విడుదల చేసింది. ఈ క్రమంలో సమాధానాల కీపై అభ్యంతరాలు ఉంటే ఏప్రిల్ 21 సాయంత్రం 5గంటలవరకు అభ్యంతరాలు తెలపవచ్చని తెలిపింది. ఇందుకుగాను ఒక్కో ప్రశ్నకు రూ.200లు చొప్పున చెల్లించాల్సి ఉంటుందని, ఆ మొత్తం రిఫండ్ కాదని తెలిపింది. జేఈఈ మెయిన్ (సెషన్-2) ఫలితాలు ఏప్రిల్ 29న విడుదలయ్యే అవకాశం ఉంది.
అయితే, ఈ పరీక్షల్లో అభ్యర్థులు సాధించిన ఉత్తమ స్కోరు (రెండు సార్లు రాసి ఉంటే)ను పరిగణనలోకి తీసుకొని జాతీయ పరీక్షల మండలి (ఎన్టీఏ) ర్యాంకులు కేటాయించనుంది. జేఈఈ మెయిన్‌లో కేటగిరీల వారీగా కటాఫ్ మార్కులు నిర్ణయించి మొత్తం 2.50 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్డ్ రాయడానికి అర్హత కల్పిస్తారు. జూన్ 4వ తేదీన జరిగే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రాయడానికి ఈనెల 30వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది.