Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్: పేదింటి ఆడబిడ్డల పెండ్లి కోసం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న కల్యాణలక్ష్మి పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిధులను కేటాయిస్తున్నది. ఈ పథకానికి ప్రభుత్వం 2023-24 బడ్జెట్లో రూ.2 వేల కోట్లు కేటాయించింది. ఆ మొత్తం నిధులను మొదటి త్రైమాసికం విడతలోనే విడుదల చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. కల్యాణలక్ష్మి/షాదీముబారక్ పథకం కింద ఈ ఏడాది జనవరి వరకు మొత్తం 12 లక్షల 469 మంది ఆడబిడ్డలకు రూ.10,410 కోట్లను సీఎం కేసీఆర్ మేనమామగా ఆర్థిక సహాయం అందించారు. ఈ బడ్జెట్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి ఒక్క కల్యాణలక్ష్మి కోసమే ప్రభుత్వం రూ.2000 కోట్లు కేటాయించింది. ఆ మొత్తాన్ని ఒకే పద్దులో ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. గత ఏడాది కంటే ఈసారి కల్యాణలక్ష్మి పథకానికి రూ.150 కోట్లను అదనంగా కేటాయించింది. నిరుడు రూ.1,850 కోట్లను ఒకేసారి విడుదల చేయడం విశేషం.