Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్: హైదరాబాద్‌లో బుధవారం ఏకకాలంలో ఐటీ సోదాలు జరిగాయి. జూబ్లీహిల్స్‌లోని మైత్రీ మూవీమేకర్స్ కార్యాలయంతోపాటు సంస్థ ప్రతినిధులు యలమంచిలి రవిశంకర్, నవీన్ ఎర్నేని ఇళ్లలోనూ సోదాలు జరిగాయి. మైత్రీ మూవీమేకర్స్ సంస్థకు ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా విదేశాల నుంచి నిధులు వచ్చినట్టు ఢిల్లీ నుంచి వచ్చిన ఐటీ అధికారులు ఆరా తీశారు. ఆర్బీఐ అనుమతి లేకుండా రూ.500 కోట్ల పెట్టుబడులు అమెరికా నుంచి వచ్చినట్టు ఈడీ అధికారులు గుర్తించారని సమాచారం. మైత్రీ మూ వీస్ నిర్మాణంలో త్వరలో విడుదల కానున్న పుష్ప-2 చిత్ర దర్శకుడు సుకుమార్ ఇంట్లోనూ ఐటీ అధికారులు సోదాలు చేసినట్టు సమాచారం. మైత్రీ మూవీస్ కార్యాలయానికి తాళం వేసి లోపల సోదాలు జరిపారు.