Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - సైదాబాద్: లండన్‌లోని ఓ బీచ్‌లో నగరానికి చెందిన విద్యార్థిని మృతి చెందింది. ఐఎస్ సదన్ డివిజన్ పరిధిలోని లక్ష్మీనగర్ కాలనీకి చెందిన కె.శశిధర్ రెడ్డి, జ్యోతి దంపతుల ఏకకై కుమార్తె కె.సాయి తేజస్విని రెడ్డి ఆరు నెలల కిందట లండన్‌కు వెళ్లింది. యూకేలోని క్రాన్ఫీల్డ్ యూనివర్సిటీలో ఏరోనాటిక్స్, స్పెస్ మాస్టర్ డిగ్రీ ఇంజినీరింగ్ విద్యను అభ్యసించడానికి వెళ్లింది. అయితే ఈనెల 11వ తేదీన బ్రైటన్ బీచ్‌లో ఆమె నీటి అలల్లో చిక్కుకొని ప్రమాదవశాత్తు మరణించింది. దీంతో అక్కడి పోలీసులు విచారణ చేపట్టి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
మృతదేహాన్ని యూకేలోని ఓ ఆసుపత్రిలో భద్రపర్చారు. ఆమె మృతదేహాన్ని ఇండియాకు తీసుకుని రావడానికి సహకరించాలని కోరుతూ రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ను కుటుంబసభ్యులు ట్విట్టర్ ద్వారా కోరడంతో స్పందించిన మంత్రి మీ నష్టానికి చాలా చింతిస్తున్నాం.. నా టీమ్ స్థానిక బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్‌ను కలిసి వెంటనే సహాయం చేస్తుందని రీట్వీట్ చేశారు. అదే విధంగా సాయి తేజస్విని సోదరి ప్రియా రెడ్డి చేసిన ట్వీట్‌పై మంత్రి కేటీఆర్ స్పందిస్తూ సాయి తేజస్విని మృతదేహాన్ని ఇక్కడికి తీసుకురావడానికి కుటుంబం చాలా అధికార సవాళ్లను ఎదుర్కొంటుందని ట్వీట్ చేశారు.