Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లాకేంద్రంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఐటీ టవర్‌ను ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే టీఆర్ మే 6న ప్రారంభిస్తారని క్రీడలశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ చెప్పారు. హైదరాబాద్‌లోని తన క్యాంప్ కార్యాలయంలో బుధవారం టీఎస్ఐఐసీ అధికారులతో ఐటీ టవర్ ప్రారంభోత్సవం, మంత్రి కేటీఆర్ పర్యటన ఏర్పాట్లపై ఆయన సమీక్ష నిర్వహించారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. హైదరాబాద్-బెంగళూరు హైవే-44 నుంచి దివిటిపల్లి శివారులోని ఐటీ టవర్ వరకు 100 ఫీట్ల రోడ్డును నిర్మించాలని ఆదేశించారు. కనెక్టింగ్ రోడ్డు ప్రారంభమయ్యే చోట ఆకర్షణీయంగా ముఖద్వారం నిర్మించాలని సూచించారు. టవర్ నుంచి మహబూబ్‌నగర్‌కు కనెక్టింగ్ రహదారులుండాలని కలెక్టర్ రవిని ఆదేశించారు. ఐటీ టవర్ ఏర్పాటుతో నాలుగేండ్ల లో 40 వేల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. సమావేశంలో టీఎస్ఐఐసీ జోనల్ మేనేజర్ రవి, డీజేఎం శ్యాంసుందర్‌రెడ్డి, కన్సల్టెంట్ రాజ్‌కుమార్, నిర్మాణ సంస్థ గుత్తేదారులు రాజశేఖర్‌రెడ్డి, అమరరాజా ప్రతినిధి రవితేజ పాల్గొన్నారు.