Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - యెమన్
పశ్చిమాసియా దేశం యెమన్‌లో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఆ దేశ రాజధాని సనాలోని ఓల్డ్‌సిటీలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 80 మందికి పైగా మృత్యువాత పడ్డారు. వందల సంఖ్యలో ప్రజలకు గాయాలైనట్లు స్థానిక పోలీసులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ఓ సంస్థ ఆర్థికసాయం పంపిణీ చేస్తుండగా ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనకు బాధ్యులను చేస్తూ ఇద్దరు నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.