Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
బిగ్‌బీ అమితాబ్ మనవరాలు, ఐశ్వర్య-అభిషేక్ బచ్చన్ కూతురు ఆరాధ్య బచ్చన్ ఓ యూట్యూబ్ టాబ్లాయిడ్‌పై ఢిల్లీ హైకోర్టులో కేసు వేసింది. తనపై అసత్య వార్తలు వ్యాప్తి చేస్తున్న ఆ టాబ్లాయిడ్‌ను నిలువరించాలంటూ కోర్టును వేడుకుంది. ఈ కేసులో కోర్టు నేడు విచారణ చేపట్టనుంది. తన ఆరోగ్యం, వ్యక్తిగత జీవితంపై ఆ యూట్యూబ్ టాబ్లాయిడ్ తప్పుడు కథనాలు ప్రచురిస్తోందని ఆరాధ్య తన పిటిషన్లో ఆరోపించింది. తాను మైనర్ కాబట్టి ఇలాంటి వార్తల వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలని కోర్టును అభ్యర్థించింది.