Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
పైరసీకి అడ్డుకట్ట వేసే లక్ష్యంతో సినిమాట్రోగ్రఫీ చట్టం-1952కు సవరణలు చేసే బిల్లుకు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదించింది. పైరసీ బెడదకు నివారణ చర్యలతో పాటూ సినిమా వర్గీకరణ వ్యవస్థను మెరుగుపరిచేందుకు పలు సవరణలను ఈ బిల్లులో ప్రతిపాదించారు. గతంలో కోర్టులు ఇచ్చిన తీర్పులకు అనుగుణంగా సినిమాటోగ్రఫీ చట్టంలో పలు మార్పులను కూడా చేర్చారు. త్వరలో జరగనున్న పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లుపై చర్చించనున్నారు. సినిమా పైరసీ నిరోధానికి ఈ బిల్లులో భారీ జరిమానాలను ప్రతిపాదించారు. పైరసీకి పాల్పడ్డ వారిపై రూ. 3 లక్షల నుంచి రూ. 10 లక్షల జరిమానాతో పాటూ గరిష్ఠంగా మూడేళ్ల పాటు జైలు శిక్ష విధించేలా ప్రతిపాదన సిద్ధం చేశారు. అంతేకాకుండా సినిమాల వర్గీకరణకు సంబంధించి యూ/ఏ7, యూ/ఏ13, యూ/ఏ46 పేరిట మూడు అదనపు కేటగిరీలను ప్రవేశపెట్టారు. ఓటీటీల్లో కంటెంట్ వర్గీకరణకు అనుగూణంగా సినిమాల్లో యూ సర్టిఫికేట్కు సంబంధించి ఈ మూడు ఉపవర్గీకరణలను చేర్చారు.
2019లో తొలిసారిగా రాజ్యసభలో సినిమాటో గ్రఫీ చట్టం సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. అప్పట్లో పైరసీపైనే లక్ష్యంగా చట్ట సవరణలు ప్రతిపాదించారు. ఈ క్రమంలో ఐటీపై పార్లమెంటరీ స్థాయీ సంఘం విచారణ చేప్టటి ఓ నివేదికను రూపొందింది. ఈ నివేదికకు అనుగుణంగా కేంద్రం సినిమాటోగ్రఫీ సవరణ బిల్లు-2023ను రూపొందించింది. బిల్లుపై ప్రజల అభిప్రాయాలు, అభ్యంతరాలను పరిగణలోకి తీసుకున్న అనంతరం కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.