Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - జనగామ
గంజాయి రవాణా చేస్తున్న ఐదుగురు వ్యక్తులను బుధవారం బచ్చన్నపేట పోలీసులు అరెస్ట్ చేశారు. జనగామ ఏసీపీ దేవేందర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకరాం... కొన్నె గ్రామానికి చెందిన వేముల రవితేజ, చిన్నరాంచర్లకు చెందిన మంత్రి శ్రీకాంత్, బసిరెడ్డిపల్లికి చెందిన బండకింది దిలీప్, సికింద్రాబాద్‌కు చెందిన మహ్మద్ హాజీతో పాటు మరో మైనర్ కలిసి గంజాయి వ్యాపారం చేస్తున్నారు. వీరు ఏపీలోని సీలేరు నుంచి గంజాయి తీసుకొచ్చి బచ్చన్నపేట మండలంలోని పలు గ్రామాల్లో అమ్ముతున్నారు. బుధవారం మొండికుంట స్టేజీ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న వీరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా గంజాయి విషయం బయటపడింది. దీంతో వారి వద్ద నుంచి 2 కిలోల గంజాయి, నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. నర్మెట్ట సీఐ నాగబాబు, బచ్చన్నపేట ఎస్సై నవీన్‌కుమార్ ఉన్నారు.