Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - చెన్నై
చెన్నైలోని పలు ప్రాంతాల్లో ఆదివారం రాత్రి బైక్ రేస్ నిర్వహించిన ఘటనల్లో 33 మోటర్ బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగరంలో పందేలు పెట్టుకొని నిర్వహిస్తున్న బైక్ రేస్‌లతో వాహనదారులు, పాదచారులకు ఇబ్బందులు కలుగుతుండగా, మరికొన్ని ఘటనలో మితిమీరిన వేగంతో రేస్‌లో పాల్గొన్నవారు ప్రమాదానికి గురై మృతి చెందిన, గాయపడిన ఘటనలు ఉన్నాయి. ఈ బైక్ రేస్‌లు అడ్డుకొనేలా ట్రాఫిక్ పోలీసులు రాత్రి వేళల్లో మెరీనా, శాంథోమ్, అడయార్, వండలూరు-మీంజూరు బైపాస్ రోడ్లపై గస్తీ ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో, ఆదివారం రాత్రి మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు ముగించుకున్న యువకులు అన్నాసాలై, తేనాంపేట, వళ్లువర్‌కోట్టం, చింతాద్రిపేట ప్రాంతాల్లో బైక్ రేస్, సాహసాలకు పాల్పడిన వ్యవహారంలో 33 బైక్‌లను స్వాధీనం చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.