Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్: ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణను ఎదుర్కొంటున్నారు. వరుసగా రెండో రోజు సీబీఐ అధికారుల ముందు ఎంపీ హాజరయ్యారు. గురువారం ఉదయం తన నివాసం నుంచి సీబీఐ కార్యాలయానికి చేరుకున్న అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారించనున్నారు. అవినాష్ రెడ్డి న్యాయవాదులు కూడా సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు. హైకోర్టు ఆదేశాలతో అవినాష్ రెడ్డి రెండో రోజు సీబీఐ అధికారులు విచారించనున్నారు. 25 వరకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దు అని హైకోర్ట్ మధ్యంతర ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా... నిన్న(బుధావారం) సుదీర్ఘంగా ఎనిమిది గంటల పాటు అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారించారు. వైఎస్ వివేకా హత్య జరిగిన రోజు జరిగిన పరిణామాలపై ఆరా తీశారు.