Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ: ఓబులాపురం మైనింగ్ కుంభకోణం కేసులో బెయిల్‌పై ఉన్న తాను బళ్లారి వెళ్లడానికి అనుమతిస్తూ షరతులను సడలించాలని గాలి జనార్దన్‌రెడ్డి చేసిన విజ్ఞప్తిని సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఓబులాపురం మైనింగ్ కుంభకోణం కేసులో ట్రయల్‌ను ఆరు నెలల్లోగా పూర్తి చేయాలని, అప్పటి వరకు గాలి జనార్దన్ రెడ్డి బళ్లారికి వెళ్లకూడదని గతేడాది అక్టోబరులో కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దాన్ని సవరించాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ బుధవారం న్యాయమూర్తులు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సీటీ రవికుమార్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందుకు వచ్చింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది మీనాక్షీ అరోరా వాదిస్తూ... రోజువారీ విచారణ జరుగుతున్నప్పటికీ 6నెలల్లో 281 సాక్షులను విచారించడం పూర్తయ్యేలాలేదని, ఇప్పటి వరకు కేవలం 51 మంది సాక్షులను మాత్రమే విచారించారని, కాబట్టి షరతును సడలించాలని విజ్ఞప్తి చేశారు.