Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసుకి సంబంధించి వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలు నేడు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. వైఎస్ వివేకా హత్య కేసులో బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ వేశారు. ఎలాంటి సంబంధం లేకుండా ఈ కేసులో తమను సీబీఐ ఆరెస్ట్ చేసిందని పిటిషన్లో పేర్కొన్నారు. తమ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని బెయిల్ మంజూరు చేయాలని భాస్కర్ రెడ్డి కోరారు. వివేకాను తామే హత్య చేశామనడానికి సీబీఐ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొన్నారు. గూగుల్ టేక్ ఆవుట్ లొకేషన్ ఆధారంగా సీబీఐ ఆరెస్ట్ చెయ్యడం సరైంది కాదన్నారు. నేడు భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ వేసిన బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరగనుంది.