Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
నల్లగొండ జిల్లా నకిరేకల్ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. వరంగల్ వైపు నుంచి హైదరాబాద్ వస్తున్న కారు నకిరేకల్ శివారులో జాతీయ రహదారిపై అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టింది. ఈ తరుణంలో అందులో ప్రయాణిస్తున్న తండ్రీ కొడుకులు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాదీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్సత్రికి తరలించారు. ఈ ఘనటపై కేసునమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.