Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
తెలంగాణ కాంగ్రెస్ లో అగ్ర నాయకుల మధ్య మరోసారి విభేదాలు బయటపడ్డాయి. రేపు నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరుద్యోగ నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నట్టు ప్రకటన చేశారు.ఈ ప్రకటనపై ఉత్తమ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తనకు కనీస సమాచారం ఇవ్వలేదన్నారు. తనతో చర్చించకుండా, తన జిల్లాలో ఏ విధంగా సభ నిర్వహిస్తారని ప్రశ్నించారు. దీంతోపాటు రేవంత్‌రెడ్డిపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. అయితే, ముందుగా ప్రకటించిన విధంగానే నిరసన ర్యాలీలను కొనసాగించాలని రేవంత్ తెలిపారు. ఈ నెల 21న నల్లగొండలో, 24న ఖమ్మంలో, 26న ఆదిలాబాద్ లో నిరసన ర్యాలీఉ జరుగుతాయని స్పష్టం చేశారు.