Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
హైదరాబాద్ మెట్రో స్టేషన్లకు ప్రయాణికులు పోటెత్తుతున్నారు. రోడ్లపై పెరుగుతున్న రద్దీతోపాటు ఎండాకాలం కావటంతో అందరూ మెట్రో వైపు చూస్తున్నారు. ఈ తరుణంలోనే నేడు అన్ని మెట్రో స్టేషన్లలో రద్దీ ఏర్పడింది. నాగోలు టూ రాయదుర్గం మార్గంలో రైల్లో ఎక్కేందుకు ఇబ్బంది పడుతున్నారు ప్రయాణికులు. నాగోలు స్టేషన్ అయితే నిండిపోయింది. అంతే కాకుండా మెట్లపై వరకు నిల్చున్నారు ప్రయాణికులు.
ఉదయం సమయంలో ప్రతి ఐదు నిమిషాలకు ఒక రైలు నడుస్తుంది. ఎండాకాలం ప్రారంభం అయినప్పటి నుంచి సర్వీసుల సంఖ్య పెంచింది మెట్రో. అయినా రద్దీ కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా నాగోలు, ఎల్బీనగర్, దిల్ షుఖ్ నగర్, కూకట్ పల్లి నుంచి ప్రాంతాల నుంచి ఉద్యోగ, వ్యాపారాల కోసం దూర ప్రాంతాలకు వెళ్లే వారు ఎండాకాలం కావటంతో చల్లగా మెట్రో వైపు మొగ్గుచూపుతున్నారు. దీంతో రద్దీ అనూహ్యంగా పెరిగిపోయింది.