Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నిందితులు వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి కస్టడీ విచారణ ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాల్సిందే అని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. కస్టడీలో సీబీఐ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ పాటించకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి వేసిన పిటిషన్పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది.
కస్టడీ విచారణలో సుప్రీంకోర్టు, హైకోర్టు మార్గదర్శకాలు పాటించాలని స్పష్టం చేసింది. అలాగే న్యాయవాదిని రెండు గంటల వరకు అనుమతించాలన్న సీబీఐ కోర్టు ఉత్తర్వులు ధర్మాసనం సవరించింది. సాయంత్రం 5గంటల వరకు అంటే విచారణ పూర్తయ్యే వరకు న్యాయవాదిని అనుమతించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి కనిపించేలా న్యాయవాదిని అనుమతించాలని తెలిపింది. అయితే ప్రశ్నలు లిఖిత పూర్వకంగా అడిగేలా సీబీఐని ఆదేశించాలని భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి కోర్టును కోరగా దర్యాప్తు ఎలా చేయాలో సీబీఐకి చెప్పలేమన్న హైకోర్టు తెలిపింది.