Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్: మైత్రి మూవీ మేకర్స్ కార్యాలయంలో వరుసగా రెండో రోజూ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. బుధవారం రోజంతా తనిఖీలు నిర్వహించిన ఆదాయపు పన్నశాఖ అధికారులు.. ఇవాళ ఉదయం నుంచి జూబ్లిహిల్స్‌లోని మైత్రి ఆఫీసుతోపాటు నిర్మాతల ప్రమోటర్స్ కార్యాలయాల్లోనూ సోదాలు చేస్తున్నారు. ఆర్బీఐ అనుమతి లేకుండా రూ.500కోట్ల వరకు అమెరికా నుంచి పెట్టుబడులు పెట్టినట్లు ఈడీ గుర్తించిన నేపథ్యంలో ఈ సోదాలు జరుగుతున్నాయి. వ్యాపార లావాదేవీలకు సంబంధించిన వివరాలను రాబడుతున్నట్లు సమాచారం. మైత్రి మూవీస్ నిర్మాణంలో ప్రస్తుతం పుష్ప-2 సినిమా తెరక్కెతున్నది. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.
గత డిసెంబర్లో మైత్రి మూవీ మేకర్స్ కార్యాలయం దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఐటీకి అందించిన లెక్కలు, కాగితాల్లో వ్యత్యాలు ఉన్నట్లుగా గుర్తించారు. తనిఖీల తర్వాత జనవరిలో మైత్రి మూవీస్ విడుదల చేసిన వీర సింహా రెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమా బడ్జెట్, లాభాలు, చెల్లించిన ఇన్ కంటాక్స్ లెక్కల్లోనూ భారీగా వ్యత్యాసం ఉందని సమాచారం. ఐటీ అధికారుల తనిఖీలు సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. మరో వైపు దర్శకుడు సుకుమార్ ఇంట్లో ఐటీ సోదాల నేపథ్యంలో పుష్ప-2 షూటింగ్ రద్దు చేసినట్లు సమాచారం. రూ.700 కోట్లకు సంబంధించి జీఎస్టీ సరిగా కట్టలేదని ఆరోపణల నేపథ్యంలో అధికారులు తనిఖీలు జరుపుతున్నట్లు తెలుస్తున్నది.