Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూఢిల్లీ: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. కోవిడ్19 పరీక్షలో పాజిటివ్‌గా తేలారు. ప్రస్తుతం ఆయన హోం క్వారెంటైన్లో ఉన్నారు. వాస్తవానికి గురువారం వైమానిక దళం కమాండర్స్ కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొనాల్సి ఉంది. అయితే వైరస్ పరీక్షలో పాజిటివ్‌గా తేలడంతో ఆయన ఆ ఈవెంట్‌కు దూరం అయినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. స్వల్పంగా కరోనా లక్షణాలతో రాజ్‌నాథ్ బాధపడుతున్నారని, డాక్టర్ల బృందం ఆయన్ను పరీక్షించిందని, వారి సూచన మేరకు ఆయన రెస్టు తీసుకుంటున్నట్లు ప్రకనటలో వెల్లడించారు.