Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : చైనా ఆక్రోబాట్ ట్రాపజే ఈవెంట్ లో అపశ్రుతి చోటు చేసుకుంది. ఒక పొడవాటి పోల్ కు కట్టిన తాడుకు వేలాడుతూ ఎంతో ఎత్తుకు వెళ్లడం ఈ ప్రదర్శనలో భాగం. చైనా సెంట్రల్ అన్హు ప్రావిన్స్ సుజోవు పట్టణంలో ఇది జరిగినట్టు బీబీసీ సంస్థ వెల్లడించింది. ప్రమాదానికి సంబంధించి వీడియో క్లిప్ సామాజిక మాధ్యమాల్లోకి చేరడంతో వైరల్ అవుతోంది. పురుష అధ్లెట్ పోల్ కు కట్టి ఉన్న తాడుని తన రెండు భుజాలకు ఆధారంగా బిగించుకున్నాడు. సదరు మహిళ ఎలాంటి ఆధారం లేకుండా పురుష అధ్లెట్ (ఆమె భర్తే) మెడకి రెండు చేతులు బిగించి వేలాడుతూ ఉంది. కానీ పోల్ కు ఉన్న తాడు ఒక్కసారిగా అటూ ఇటూ షేక్ కావడంతో మహిళ బ్యాలన్స్ ఆపుకోలేక చేతులు జారిపోయి కింద స్టేజ్ పై పడిపోయింది. దీంతో తీవ్ర గాయాలైన ఆమెను ఆస్పత్రికి తరలించగా ప్రాణాలు విడిచింది. ఆమె పేరు సన్ కాగా, ఆమె భర్త పేరు జాంగ్. వీరిద్దరూ కలసి ఎన్నో ఏళ్లుగా ఈ ప్రదర్శనలు చేస్తూ వస్తున్నారు. సేఫ్టీ బెల్ట్ లేకుండా వారికి ఈ విన్యాసం చేయడం అలవాటేనని తెలుస్తోంది.