Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : గంగా నది పుష్కరాలు ఈ నెల 22న ప్రారంభం కానున్నాయి. వైశాఖ శుక్ల విదియ రోజున గురుడు మేషరాశిలో ప్రవేశించడంతో గంగా నది పుష్కరాలు ప్రారంభం అవుతాయి. 12 రోజుల పాటు జరిగే ఈ పుష్కరాలు మే 3న వైశాఖ శుక్ల ద్వాదశి నాడు ముగియనున్నాయి. కాగా, పుష్కరాలకు వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. పుష్కర ప్రాంతాల్లో భక్తులకు భోజన వసతి కల్పిస్తున్నారు.