Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - న్యూడిల్లీ
ట్విట్టర్‌కు దేశీ ప్రత్యామ్నాయంగా ముందుకొచ్చిన సోషల్ మీడియా ప్లాట్‌ఫాం కూ 200 మంది ఉద్యోగులపై వేటు వేసింది. ట్విట్టర్ ఇండియా ప్రత్యర్ధి కూ గత కొద్ది నెలలుగా 30 శాతం మంది ఉద్యోగులను సాగనంపిందని బ్లూమ్‌బర్గ్ రిపోర్ట్ తెలిపింది. గత రెండు నెలలుగా 7000 మందికిపైగా ఉద్యోగులను తొలగించిన అనంతరం 1500 మంది ఉద్యోగులతో మైక్రో బ్లాగింగ్ సైట్‌ను రన్ చేస్తున్నామని బిలియనీర్ ఎలన్ మస్క్ వెల్లడించిన అనంతరం కూ లేఆఫ్స్ వెల్లడికావడం గమనార్హం.
తాజా లేఆఫ్స్‌కు ముందు 15 మంది ఉద్యోగులను గత ఏడాది కూ తొలగించింది. ట్విట్టర్‌కు ప్రత్యామ్నాయంగా పలువురు భారత సెలబ్రిటీలు కూడా కూ వైపు మళ్లారు. ఇక స్టార్టప్ ఫండింగ్ తగ్గుతుండడంతో కూ లేఆఫ్స్ నిర్ణయం తీసుకోవడం ఆందోళన రేకెత్తిస్తోంది. బాధిత ఉద్యోగులకు పరిహార ప్యాకేజ్‌తో పాటు హెల్త్ బెనిఫిట్స్, కొత్త ఉద్యోగాలను అన్వేషించే తరుణంలో సాయం అందచేస్తామని కంపెనీ ప్రతినిధి తెలిపారు.