Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : బద్రీనాథ్ దేవాలయం వద్ద మంచు దుప్పటి పరుచుకున్నది. చమోలి జిల్లాలోని బద్రీనాథ్‌లో ఏప్రిల్ 20వ తేదీన భారీ మంచు కురిసింది. ఉత్తరాఖండ్ లో తాజాగా మంచు కురవడంతో అక్కడ దట్టమైన మంచు దుప్పటి కప్పుకుంది. మార్చిలో, చమోలి జిల్లాతో సహా జోషిమత్‌లోని ఎత్తైన పర్వత శ్రేణులు, చమోలి జిల్లాలోని బద్రీనాథ్ పవిత్ర పుణ్యక్షేత్రం మంచు దుప్పటితో కప్పబడినాయి. బద్రీనాథ్ తో పాటు కేదారినాథ్ తదితర ప్రాంతాల్లోని శిఖరాలపై మంచు కురుస్తోంది. దిగువ ప్రాంతాలలో అడపాదడపా వర్షాల కారణంగా రాబోయే చార్ ధామ్ యాత్రా సన్నాహలకు అడ్డంకిగా మారాయని అధికారులు చెబుతున్నారు. బద్రీనాథ్, కేదారినాథ్ పుణ్యక్షేత్రాలు ఉన్న చమోలి, రుద్ర ప్రయాగ్ జిల్లాల్లో మంచు గాలుల కారణంగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఏప్రిల్ 25వ తేదీన భక్తుల కోసం తెరుచుకునే ట్రెక్ మార్గం ఇప్పుడు హిమపాతంతో నిండిపోయిందని చెప్పారు.