Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అమరావతి
సవాళ్ల పర్వంతో అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం ఎన్.హనుమాపురంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి బుధవారం కణేకల్ మండలం ఎన్.హనుమాపురం గ్రామంలో పర్యటించారు.
ఈ తరుణంలో నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులపై చర్చకు రావాలని ఆయన సవాల్ విసిరారు. సవాలును స్వీకరించిన మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు గురువారం మధ్యాహ్నం ఎన్.హనుమాపురం గ్రామానికి వెళ్లారు. అభివృద్ధిపై చర్చకు సిద్ధమని, ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి రావాలని ప్రతి సవాల్ చేశారు. చర్చకు రావాలంటూ గ్రామంలోకి వెళ్లి కూర్చున్నారు. కాసేపటి తర్వాత మీడియాతో మాట్లాడుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు మాజీ మంత్రి కాలువను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు.