Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
హైదరాబాద్ నగర శివారులో ఐపీఎల్ బెట్టింగ్ నిర్వహిస్తున్న స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ తరుణంలో 12 మందిని అరెస్టు చేయగా, ఐదుగురు వ్యక్తులు పరారీలో ఉన్నారు. అయితే బెట్టింగ్ ముఠా నుంచి రూ. 50 లక్షల నగదు, 20 స్మార్ట్ ఫోన్లు, 8 ల్యాప్టాప్స్, 43 కీ ప్యాడ్ ఫోన్స్, నాలుగు టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.