Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - వరంగల్
వరంగల్ బస్టాండ్ లో దారుణం చోటుచేసుకుంది. డ్రైవర్ నిర్లక్ష్యం ఓ విద్యార్థి ప్రాణాన్ని బలితీసుకుంది. విద్యార్థిని బస్సు ఢీకొట్టడంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన మిగతా స్టూడెంట్స్ బస్టాండులోనే ఉన్న నాలుగు బస్సుల అద్వాలను ధ్వంసం చేశారు.
వీరితో పాటు ప్రయాణికులు కూడా ఆందోళనకు దిగారు. అయితే తన స్నేహితుడిని బస్సు ఎక్కించడానికి చింతా అనిల్ అనే విద్యార్థి వరంగల్ బస్ స్టాండ్ కు వెళ్లాడు.ఈ క్రమంలో వెనుక నుంచి వచ్చిన ఓ ఆర్టీసీ బస్సు అనిల్ ను ఢీ కొనడంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఇది గమనించిన ప్రయాణికులు, విద్యార్థులు నాలుగు బస్సుల అద్దాలను కోపంతో ధ్వంసం చేశారు. విషయం తెలియగానే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అనిల్ మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎం మార్చురీకి తరలించారు.