Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : మొహాలీలో పంజాబ్ వర్సెస్ బెంగళూరు జట్ల మధ్య జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ జట్టు ఘన విజయం సాధించింది. పంజాబ్ జట్టు 150 పరుగులకే ఆలౌట్ కావడంతో బెంగళూరు జట్లు 24 పరుగులతో గెలుపోందింది. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు నిర్ణిత 20 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి 174 పరగులు చేసింది. బెంగళూరు బ్యాట్స్ మెన్లలో ఓపెనర్లు డుప్లిసెస్ (84), విరాట్ కోహ్లి (59) అర్ధ సెంచరీలు సాధించడంతో బెంగళూరు జట్టు భారీ స్కోరు చేసింది. 175 పరుగుల లక్ష్యంతో భరిలోకి దిగిన పంజాబ్ ఆరంభంలోనే వికెట్లు కోల్పోతు వచ్చింది. ఓపెనర్ ప్రబ్ సిమ్రాన్ సింగ్ (46) జీతేష్ శర్మ (41) పోరాడిన మిగత బ్యాట్స్ మెన్లు సహకరించకపోవటంతో 18.2 ఓవర్లకే 150 పరగులకు ఆలౌట్ అయ్యింది. బెంగళూరు బౌలర్లలో సిరాజ్ అద్భుత బౌలింగ్ తో నాలుగు వికెట్లు తీయగా హసరంగా రెండు వికెట్లు తీశాడు. ప్రానెల్, హర్షల్ పఠేల్ చెరో వికెట్ తీసుకున్నారు.